మార్కులు తగ్గుతాయనే .. భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది

మార్కులు తగ్గుతాయనే .. భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది

పద్మారావునగర్​, వెలుగు: మార్కులు తగ్గుతాయనే భయంతో ఓ ఇంటర్​స్టూడెంట్​ఇంటి నుంచి వెళ్లిపోయింది. చిలకలగూడ ఎస్సై జ్ఞానేశ్వర్​వివరాల ప్రకారం.. సీతాఫల్​మండీకి  చెందిన శ్రీనిధి(16) నారాయణగూడలోని ప్రైవేట్ కాలేజీ ఇంటర్​ఫస్ట్​ఇయర్​చదువుతోంది. ఇటీవల ఎగ్జామ్స్​రాసింది. 

అయితే తక్కువ మార్కులు వస్తాయేమోనని ఆందోళన చెందిన శ్రీనిధి.. ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు మిస్సింగ్​కేసు నమోదు చేశారు.