పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ లో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఘన్పూర్ లోని హ్యాపీ హోం లో ఇంటర్ చదవుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ సెంకడియర్ చదువుతున్న స్వప్న అనే విద్యార్థిని ఇటీవల వెలువడిన పరీక్షల ఫలితాల్లో ఉహించిన మార్కులు రాకపోవడంతో మనస్థాపానికి గురైంది.  

ఈ క్రమంలో ఎవరు లేని సమయంలో క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కళశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కూతురు మృతదేహం చూసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.