గురుకుల స్కూల్లో .. గుండెపోటుతో ఇంటర్ స్టూడెంట్​ మృతి

వికారాబాద్, వెలుగు: గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని గురుకుల స్కూల్ లో జరిగింది. ప్రిన్సిపాల్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం బక్కారం గ్రామానికి చెందిన నందిని(16) వికారాబాద్ పట్టణం కొత్తగడిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం నందిని శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది  వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

ALSO READ :ఎస్సారెస్పీ 32 గేట్లు ఓపెన్.. నిండుకుండలా మారిన ప్రాజెక్టు

అప్పటికే విద్యార్థిని చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నందిని గుండెపోటుకు గురై మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని ప్రిన్సిపాల్ అపర్ణ చెప్పారు. తన కూతురు మృతిపై ఎలాంటి అనుమానం లేదని నందిని తల్లి వెంకటమ్మ తెలిపింది. గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థిని కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీనివాస్  తెలిపారు.