
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక నిమిషం నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే యువకుడు గురువారం సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా తాను సమయానికి వెళ్లకపోవడంతో పరీక్ష రాయలేకపోయానని బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు. కన్న కొడుకు ఇక లేడని వార్తను అతని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల బుధవారం ప్రారంభమయ్యాయి ఫస్ట్ ఈయర్ పరీక్షను నిమిషం నిబంధన వలన కొంత మంది విద్యార్థులు రాయలేకపోయారు. దీంతో చేసేది లేక విద్యార్థులు వెనుదిరిగారు.