
మహబూబ్‌నగర్, వెలుగు: ఇప్పటికిప్పుడు పరీక్ష పెట్టినా టాప్ మార్కులు తెచ్చుకుంటానని చాలెంజ్ చేసిన విద్యార్థినిని పాస్ చేసి ఇంటర్ బోర్డు తప్పు సరిదిద్దుకుంది. 921 మార్కులు వచ్చినా.. ఫిజిక్స్ పేపర్ 2లో 14 మార్కులేసి ఫెయిల్ చేసిన అధికారులను మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థిని కేఎం గ్రేస్ సవాల్ చేసింది. ఆ విషయాన్ని ‘వెలుగు’ వెలుగులోకి తెచ్చింది. సోమవారం ప్రజావాణిలో తన తండ్రితో కలెక్టర్ ను కలిసి వెలుగు పత్రిక కథనాన్ని అందించింది. ఆ ఫిర్యాదుతో ఇంటర్ బోర్డు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. రీవాల్యుయేషన్ లో గ్రేస్‌కు 44 మార్కులొచ్చాయి.
951 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. తనకు సాయమందించిన వెలుగుకు గ్రేస్ కృతజ్ఞతలు తెలిపింది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాను అనగానే జీవితంలో ఓడిపోయానని బాధపడ్డానంటూ గ్రేస్ చెప్పుకొచ్చింది. తాను చదువుతున్న వాగ్దేవి కాలేజీ కరస్పాండెంట్ ఓదార్చారని, తనకు జరిగి న అన్యాయాన్ని వెలుగు పేపర్ బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పింది. వెలుగు పేపర్ అందించిన సహకారం వల్లే తాను తిరిగి పాస్ కాగలిగానని చెప్పింది.
ఫెయిల్ మెమో, పాస్ అయినట్టు వచ్చిన సవరణ మెమో