మేడ్చల్ మల్కాజ్ గిరి: ఫీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని కళాశాల గర్ల్స్ క్యాంపస్ లోని తన రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కళాశాల సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వర్ష స్వస్థలం వనపర్తి జిల్లా వీపనగండ్ల అని తెలుస్తోంది. వర్ష ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే కాలేజీలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రమాదేశి అనే ఫస్టియర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.