ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 24న మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే MPC చదువుతున్న విద్యార్థి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి తేజ ఆత్మహత్య కు గల‌ కారణాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుతున్నాయి. ఈ క్రమంలో సాయి తేజ బలవన్మరణాకి పాల్పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.