ఖమ్మం జిల్లా వైరాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాహ్మణపల్లికి చెందిన గార్లపాటి ప్రవంత్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ వైరా రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కోసం రిజర్వాయర్ లో గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ లో ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ శివకుమార్ ఎగ్జామ్ కు అటెండ్ కాలేకపోయాననే మనస్థాపంతో సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.