సిద్దిపేట జిల్లా చేర్యాలలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పదోతరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడికి పాల్పడ్డారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక భయంతో వీధుల వెంబడి పరురుగులు తీస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు విద్యార్థులు.
హాస్టల్లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులు వారి తరగతి గదిలో చదువుకుంటున్న సమయంలో అదే హాస్టల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విధ్యార్థులు అల్లరి చేస్తున్నారనే నెపంతో అకారణంగా దాడికి పాల్పడ్డారు. బెల్టులతో, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టడంతో దెబ్బలకు తట్టుకోలేక గోడ దూకి పరుగులు తీశారు పదో తరగతి విద్యార్థులు. తల దాచుకునేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేర్యాల పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు.