
వేలాది మంది విద్యార్థుల ఎంసెట్ ఆశలకు ఇంటర్ ఫలితాలు గండికొట్టాయి. గతంలో మాదిరే ఈసారికూడా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెబుతున్నఅధికారుల మాటలకు, రెండేండ్ల లెక్కలకు పొంతన కుదరడం లేదు. గతేడాది కంటే ఈసారి పెద్దమొత్తంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో స్టూడెంట్స్ ఫెయిలవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
శాతం తక్కువ.. సంఖ్య ఎక్కువ
2018లో జరిగిన పరీక్షలకు 8,85,167 మందిహాజరైతే, 5,72,996 (64.73 శాతం) మంది పా-సయ్యారు. ఈ ఏడాది 8,70,924 మంది పరీక్షలురాస్తే, 5,42,524 (62.29 శాతం) మంది ఉత్తీర్ణతసాధిం చారు. ఈ లెక్కలను పరిశీలిస్తే కేవలం రెం డుశాతమే తేడా కనిపిస్తుం ది. కానీ విద్యార్ థుల సంఖ్యవేలల్లో ఉంటుం ది. అయితే ఏటా రెం డు, మూడుశాతం ఉత్తీర్ణత శాతం పెరగడం, తగ్గడం కామన్‌అని అధికారులు చెబుతున్నారు.
ఐదు నుంచి ఆరు శాతం
సెకండియర్ మ్యాథ్స్ ఏ, బీ రెం డు సబ్జెక్టు లతోపా-టు ఫిజిక్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌అయ్యారు. 2018తో పోలిస్తే మ్యాథ్స్ 2(ఏ)లో4.15 శాతం, మ్యాథ్స్2(బీ)లో 5 శాతం, ఫిజిక్స్‌లో6 శాతం ఈ ఏడాది తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.మిగిలిన సబ్జెక్టుల్లో ఒకటీ, రెండు శాతాల్లోపే ఉత్తీర్ణతపెరుగుదల, తగ్గుదల ఉంది. మరోవైపు చాలా మందిఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మార్కులకు బదులుగాఏపీ, ఏఎఫ్ అనే అక్షరాలు పడ్డాయి . ఫస్టియర్ లోమ్యాథ్స్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్ థులకుకూడా ఈసారి బార్డర్ మార్కులు వచ్చాయి. చాలామంది ఫెయిల్ అయ్యారు. ఇప్పటి కే రీ కౌంటింగ్,రీ వెరిఫికేషన్ కోసం ఏకంగా 46 వేల మంది 1.08లక్షల పేపర్లకు ఫీజు చెల్లించారు. వీరుగాక ఫెయిల్ అయిన మరో మూడు లక్షల మందికి ప్రభుత్వమే ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తిచేయనుంది. తాజాగా త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఫస్టియర్ లో 80శాతం మార్కులొచ్చి ఫెయిలైన వారికీ ఉచితంగానే రీ వెరిఫికేషన్ , రీ కౌంటింగ్ నిర్వహిస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం ప్రక్రియకు మరో 15 రోజుల పట్టే అవకాశముంది.
ఎంసెట్ పై ప్రభావం
ఇంటర్ ఫలితాలు ఎంసెట్ పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ఫలితాలకు ప్రాధాన్యం వచ్చింది. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఎక్కువ మంది ఫెయిల్‌కావడం, చాలా మందికి తక్కువ మార్కులు రావడంతో ర్యాంకులు తారుమారయ్యే అవకాశముం ది. దీంతో నచ్చిన కాలేజీలో సీట్లురాకపోవచ్చని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసంవిద్యార్థులు ఫీజు కట్టినా, తక్కువ మార్కు లేఇస్తారనే భయం వారిలో కొనసాగుతోంది.