హైదరాబాద్, వెలుగు : ఈ నెల 24 నుంచి ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4.26 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ కానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు.
శుక్రవారం సాయంత్రం నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పెట్టినట్టు చెప్పారు. ఫస్టియర్ స్టూడెంట్లకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండియర్ స్టూడెంట్లకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకూ ఎగ్జామ్స్ ఉంటాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 926 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.