
-
షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య రిలీజ్ చేశారు. మే 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిరోజూ రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫస్టియర్ స్టూడెంట్లకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి.
కాగా, ఆదివారం కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. జూన్ 3 నుంచి 6 వరకూ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫస్టియర్ విద్యార్థులకు జూన్ 9న, సెకండియర్ స్టూడెంట్లకు 10న ఉండనున్నది. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జూన్ 11న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుస్ ఎగ్జామ్ జూన్ 12న ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు.