ఇంటర్‌‌ కాంటినెంటల్‌ కప్‌: ఇండియా, మారిషస్‌ మ్యాచ్ డ్రా

హైదరాబాద్, వెలుగు: దాదాపు 16 ఏండ్ల  సుదీర్ఘ  విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో ఆడిన తొలి మ్యాచ్‌లో  ఇండియా సీనియర్ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్ ఆకట్టుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీని  డ్రాతో  ఆరంభించింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో తనకంటే తక్కువ ర్యాంకర్ మారిషస్ (174)తో తొలి మ్యాచ్‌‎లో ఒక్క గోల్ కూడా  కొట్టలేకపోయింది. ఫలితంగా ఈ పోరు 0–0తో డ్రాగా ముగిసింది. 124వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా  బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలోనే ఉంచుకున్నా  గోల్ మాత్రం సాధించలేకపోయింది. ఆట ఆరంభంలోనే మారిషస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండుసార్లు గోల్ ప్రయత్నాలను ఇండియా డిఫెండర్లు సమర్థవంతంగా నిలువరించారు.

 34వ నిమిషంలో స్ట్రయికర్ మన్వీర్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‎పై దాడి చేయగా.. మారిషస్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డుకున్నాడు.  సెకండాఫ్‌లో అయినా  ఖాతా తెరిచేందుకు ఇండియా దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినా ఫలితం లేకపోయింది. అటువైపు మారిషస్ సైతం కొన్ని అవకాశాలను సృష్టించుకున్నా ఆతిథ్య జట్టు డిఫెన్స్‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయింది. శుక్రవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో  సిరియాతో మారిషస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలపడనుంది. ఈ నెల 9న చివరి పోరులో సిరియాతో ఇండియా పోటీ పడనుంది.

హైదరాబాద్‌‌‌‌ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మూడు దేశాలు పాల్గొంటున్న  ఈ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. మెగా ఈవెంట్‌‌‌‌ను ఆలిండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌) హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.   హైదరాబాద్‌‌‌‌ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తామని, ఆ దిశగానే తమ ప్రయత్నాలు ఉన్నాయని తెలిపారు.