- ఇప్పటికే 172 ఫ్యామిలీలతో లిస్ట్ ఫైనల్!
హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయా గ్రూపుల్లో మొత్తం 172 మంది మహిళలను గుర్తించి, వారికి గ్రూపుల వారీగా, విడివిడిగా బ్యాంకు అకౌంట్లు కూడా ఓపెన్ చేయించినట్లు సమాచారం. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్(యూసీడీ) నుంచి స్త్రీనిధి ద్వారా స్వయం సహాయక బృందాలకు వ్యాపారం
ఇతర వృత్తులు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలను అందించడానికి చర్యలు చేపడుతున్నారు. అలాగే.. డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాల్లో పిల్లల్ని గుర్తించి, సమీపంలోని స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం159 మంది పిల్లల్ని గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 37 మంది పిల్లల్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సమీపంలో ఉన్న స్కూళ్లలో జాయిన్ చేశామని అధికారులు తెలిపారు. మరికొందరు గురుకులాల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో దాదాపు అందరినీ స్కూళ్లలో జాయిన్ చేస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.