- పరిమితులను తొలగించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు బకాయిలపై ఏడాదికి 30 శాతం కంటే ఎక్కువ వడ్డీని వేసేందుకు బ్యాంకులకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ వేయకూడదని 2008 లో నేషనల్ కన్జూమర్ డిస్‌ప్యూట్ రిడ్రసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఇచ్చిన ఆర్డర్‌ను తోసిపుచ్చింది. నిర్దిష్టమైన టైమ్ పీరియడ్‌లో క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించకపోతే ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ
వేయడానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో 2008 లో ఎన్‌సీఆర్‌డీసీ ఆర్డర్స్ ఇచ్చింది. మినిమమ్ అమౌంట్ లేదా ఫుల్ పేమెంట్ చేయకపోతే క్రెడిట్ కార్డు యూజర్లపై ఏడాదికి 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ వేయడం వినియోగదారుల చట్టాలకు విరుద్ధమని అప్పుడు పేర్కొంది. నెలవారీ వడ్డీ వేయడాన్ని కూడా తప్పుబట్టింది.