బాదుడే బాదుడు.. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్లపై వడ్డీ పెంపు

బాదుడే బాదుడు.. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్లపై వడ్డీ పెంపు

 న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) తమ లోన్లపై వడ్డీ రేట్లను  పెంచింది.  లోన్లపై వేసే మినిమమ్ వడ్డీ రేటు  ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  0.10 శాతం పెంచింది.  మారిన రేట్లు  సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్ పెరగడంతో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఇచ్చే ఆటో, హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్లపై వడ్డీ పెరగనుంది. కిందటి నెలలో కూడా ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మార్జినల్ కాస్ట్  ఆఫ్ ఫండింగ్‌‌‌‌‌‌‌‌ బేస్డ్ లెండింగ్‌‌‌‌‌‌‌‌) ను 0.10 శాతం పెంచింది.

ALSO READ : అదానీ చేతికి జేపీ సిమెంట్​?

 ఒక నెల ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  0.05 శాతం పెరిగి 8.35 శాతానికి  చేరుకోగా, మూడు నెలలు,  ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ను 0.10 శాతం పెంచింది. వీటి రేట్లు 8.40 శాతం నుంచి 8.95 శాతం మధ్య ఉన్నాయి.  మూడేళ్ల ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  0.05 శాతం పెరిగి 9 శాతానికి చేరుకుంది.  రెపో రేటు వంటి ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్నల్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ లెండింగ్ రేట్ల (ఈబీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  కు లింక్ అయి ఉన్న వడ్డీ రేట్లు మారలేదు.