నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్య వహరం పార్టీలో మిస్టరీగా మారింది. సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్రకు వెంకటరెడ్డి రాకపోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గం నల్గొండతో సహా, ఎంపీగా ప్రాతినిధ్యం వహించే భువనగిరి సె గ్మెంట్లో సైతం వెంకటరెడ్డి పాల్గొనలేదు. అసలు వెంకటరెడ్డి రాకపోవడానికి బలమైన కారణాలు ఏమై ఉండొచ్చని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లా సీనియర్లు సంఘీభావం తెలిపినట్టుగానే వెంకటరెడ్డి సైతం కొండ మల్లేపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
అంతకంటే ముందు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో భట్టి యాత్ర సాగింది. ఈ రెండు చోట్ల జరిగిన కార్నర్ మీటింగ్‌లకు వెంకటరెడ్డి రాలేదు. కానీ ఎంపీ ఉత్తమ్ మాత్రం భువనగిరి మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇక వెంకటరెడ్డి సొంత నియోజక వర్గం నల్గొండలో భట్టి నాలుగు రోజులు మకాం పెట్టినా ఒక్కసారి కూడా రాలేదు. సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలో భట్టి యాత్ర చివరి దశకు చేరుకున్న నకిరేకల్‌లోనూ వెంకటరెడ్డి అడుగుపెట్టకపోవడం పలు అ నుమానాలకు తావిస్తోంది.
పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి...
వెంకటరెడ్డి గుండెకాయలాగా భావించే నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గా ల్లో ఆయన పాల్గొనకపోవడం పట్ల పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాల్లో భట్టి యాత్ర సక్సెస్ చేసేందుకు వెంకటరెడ్డి తెరవెనకాలే అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ మీటింగ్‌కు వస్తానని మీడి యా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. కానీ చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. నల్గొండకు వెంకటరెడ్డి రావడం లేదని తెలిసిన పార్టీ నాయకులు మీటింగ్‌కు రాకుండా మొఖం చాటేశారు. చివరి నిమిషంలో ఎంపీ ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి హాజరై పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నించా రు. నకిరేకల్‌లో కూడా వెంకటరెడ్డి వస్తాడని స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లే చేశారు. సోమవారం వెంకటరెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో వెంకటరెడ్డి రాకపోవడానికి బలమైన కారణాలు ఇంకేమైనా ఉండొచ్చని పార్టీ నాయకులు సందేహిస్తున్నారు.
ప్రియాంక రాకపోవడంతోనే
నల్గొండకు ప్రియాంక గాంధీ రాకపోవడంతోనే వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. భట్టి యాత్రలో భాగంగా నల్గొండలో ప్రియాంక సభ పెడ్తామని రేవంత్ నిరుద్యోగ సభలో వెంకటరెడ్డి ప్రకటించారు. అయితే ప్రియాంక సభ విషయంలో జిల్లా పార్టీ సీనియర్లు అంతగా స్పందించలేద ని, దీంతో వెంకటరెడ్డి ఒంటరిగానే నల్గొండకు ప్రియాంకను రప్పించేందు కు ఢిల్లీలో శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఖమ్మం సభను దృష్టిలో పెట్టుకుని ప్రియాంక నల్గొండకు రాలేనని చెప్పినట్లు తెలిసింది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖ మ్మంలో ఈ నెలాఖరున భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు. రెండు జిల్లాలో ఒకేసారి పెద్ద సభలు అంటే పార్టీ పరంగా సంకేతాలు ఇంకోరకంగా పోతాయానే ఆలోచనకు వచ్చిన పార్టీ హైకమాండ్ నల్గొండ సభను జులై నెలా ఖరుకు వాయిదా వేసినట్లు తెలిసింది. కేవలం ఒక్క నల్గొండ జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా అంతా కలిపి నల్గొండలో పెద్ద సభకు ప్లాన్ చేయాలని హైకమాండ్ సూచించినట్లు పార్టీ ముఖ్యులు తెలిపారు.