‘పిట్టకొంచెం కూత ఘనం’.. అనే సామెత ఈ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. డాన్స్, సాంగ్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది ఈ చిచ్చరపిడుగు. ప్రస్తుతం సమంత, వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ : హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. చేసింది చిన్న పాత్రే అయినా అది పవర్ఫుల్ పాత్ర కావడంతో, తనకు ఉన్న లిమిటెడ్ సీన్స్‌లో కూడా తనదైన శైలిలో నటించి గుర్తింపు తెచ్చుకుంటోంది. తనెవరో కాదు.. ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా(నాడియా) చిన్నప్పటి పాత్రలో నటించిన కష్వీ మజ్మున్దార్. ఈనెల 14న (గురువారం) చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి.
కష్వీమజ్మున్దార్.. ఆస్ట్రేలియాలో ఉండే ఇండియన్ ఫ్యామిలీలో పుట్టింది. తనకు నెలల వయసున్నప్పుడే 2022లో వాళ్ల ఫ్యామిలీ దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం తన వయసు ఎనిమిదేండ్లు. కష్వీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. దాంతో ఊహ తెలిసినప్పటి నుంచే స్టేజ్ షోల్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా చెప్పాలంటే.. వాళ్లుండే ప్రాంతంలో అద్భుతంగా డాన్స్ చేసే చైల్డ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన కూతురు డాన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోలేదు. డాన్స్ స్కూల్‌కి పంపలేదు. ఏడాది వయసున్నప్పటి నుంచే రిథమ్‌కి తగ్గట్టు డాన్స్ చేసేదని కష్వీ తల్లి ప్రత్యూష ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నిజానికి చాలామంది పిల్లలు ఆ వయసులో సరిగ్గా నిల్చోవడం నేర్చుకుంటారు. కానీ, కష్వీ అలా కాదు.. డాన్స్ చేయాలని ప్రయత్నించేదని ఆమె చెప్పింది.
ఎంజాయ్ చేస్తా
నాకు మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం. ఫిక్షన్ స్టోరీ బుక్స్ చదువుతా. స్పోర్ట్స్ ఆడతాను. జిమ్నాస్టిక్స్ చేస్తాను. స్విమ్మింగ్ కూడా చేస్తా. నాకు స్టేజ్ ఫియర్ లేదు. స్టార్స్‌తో కలిసి డాన్స్ చేయాలంటే భయపడను. ఎంజాయ్ చేస్తాను.
నోరా ఫతేహితో డాన్స్..
ఐఫా అవార్డ్స్ 2022లో వేదిక మీద పాపులర్ డాన్సర్ నోరా ఫతేహితో కలిసి డాన్స్ చేసింది కష్వీ. నోరా ఫతేహి పాడిన ‘నాచ్ మేరి రాణి’ సాంగ్‌కి తను డాన్స్ చేసిన ఆ వీడియో వైరల్ అయింది. అయితే, ఐఫా జరగడానికి ఒకరోజు ముందువరకు తను ఒక పెద్ద డాన్సర్‌తో కలిసి పర్ఫార్మ్ చేయాల్సి వస్తుందని వాళ్లు ఊహించలేదు. అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం లేదు. దాంతో కష్వీ, నోరా ఫతేహీని చూస్తూ తను వేసిన స్టెప్స్‌ని అనుసరించింది. దాంతో తన డాన్సింగ్ స్కిల్స్ చూసి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.
బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, షాహిద్ కపూర్ వంటి వాళ్లు కూడా తన టాలెంట్‌ని చూసి మెచ్చుకున్నారు. దాని గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ... ‘‘నేను డాన్స్ స్కూల్‌కి వెళ్లలేదు. కానీ, నోరా ఫతేహి చేసే డాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో చూసేదాన్ని. ఆమె డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె వేసిన స్టెప్స్‌ని నేను వేయడానికి ట్రై చేస్తా. బాలీవుడ్ సాంగ్స్‌కి డాన్స్ చేయడమంటే చాలా ఇష్టం” అని చెప్పింది కష్వీ.
సల్మాన్ అంకుల్
కష్వీ సల్మాన్ ఖాన్ని మొదటిసారి ఐఫా అవార్డ్స్ ఫంక్షన్లో కలిసింది. కష్వీకి, వాళ్ల అమ్మకు ముందు వరుసలో కూర్చుకోవడానికి సరైన బ్యాడ్జి లేకపోవడంతో ఆయనే రికమండ్ చేశాడు. అప్పటినుంచి కష్వీ ప్రేమగా సల్మాన్‌ని అంకుల్ అని పిలుస్తుంటుంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా..
ఐఫాకు వెళ్లక ముందు లోకల్ డాన్స్ కాంటెస్ట్‌లలో పార్టిసిపేట్ చేసింది. 5 నుంచి15 ఏండ్ల లోపు వాళ్లకు పెట్టిన డాన్స్ కాంపిటీషన్లో130 మంది అప్లయ్ చేయగా యంగెస్ట్ ఫైనలిస్ట్ల్లో ఒకరిగా నిలిచింది. తను యాక్టింగ్ కూడా చేస్తుంది. తన స్కిల్స్ చూసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, అప్పట్లో ఏవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్‌తో ఆడిషన్స్‌కు వెళ్లింది. చూస్తే.. అది హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్లో ప్రియాంక చోప్రా నటించిన నాడియా పాత్ర.
అందులో సెలక్ట్ కావడంతో చిన్నప్పటి నాడియాగా నటించింది కష్వీ. ‘సిటాడెల్ : హనీబన్నీ’ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో చిన్నప్పటి నాడియా పాత్ర కోసం ఆడిషన్స్ జరిగాయి. ఆడిషన్స్ అయిపోయాక ప్రొడ్యూసర్స్ రాజ్ అండ్ డీకే ఫోన్ చేసి ఆ పాత్రకు సెలక్ట్ అయ్యానని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యా. ప్రియాంక చోప్రా ఆల్ రౌండర్. పాటలు పాడుతుంది. డాన్స్ చేస్తుంది. యాక్టింగ్ చేస్తుంది. నేను కూడా మూడూ చేయగలను.
సో ఈ క్యారెక్టర్‌కి నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది”అని మురిసిపోయింది కష్వీ. దీంతో అక్కడున్న వాళ్లంతా తన ధైర్యానికి మెచ్చుకున్నారు. కష్వీకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. దానికి వెయ్యి మంది ఫాలోవర్లు ఉండేవాళ్లు. ఐఫా నైట్ పర్ఫార్మెన్స్ తర్వాత ఒక్క రాత్రిలో 25,000 ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం 175k ఫాలోవర్లు ఉన్నారు.