సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్గ్రౌండ్ ఇదే..

సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్గ్రౌండ్ ఇదే..

టాలీవుడ్ నటుడు సుబ్బరాజు.. స్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఏదో నేరమైనట్టుగా సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ రావడం అతని కుటుంబాన్ని విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఆయనతో ఏడడుగులు నడిచిన చి॥ల॥సౌ॥ స్రవంతి ఎవరనే విషయాన్ని సుబ్బరాజు ఎక్కడా బయటపెట్టలేదు. ఇన్స్టాగ్రాంలో పెళ్లి చేసుకున్న ఫొటోను మాత్రమే పోస్ట్ చేశాడు. ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు స్రవంతి అని నెటిజన్లు తెలుసుకున్నారు. తాజాగా.. సుబ్బరాజు భార్య స్రవంతి గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు. ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్. సైన్స్ పట్ల విపరీతమైన మక్కువ. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా సుబ్బరాజు భార్య స్రవంతి వర్క్ చేస్తున్నారు. ఆమెకు ఇన్ స్టాగ్రాం అకౌంట్ కూడా ఉంది. తన ఫస్ట్ లవ్ సైన్స్ అని, మ్యారీడ్ టు ఫిట్నెస్ అని ఆమె తన ఇన్స్టా బయోలో మెన్షన్ చేశారు. అమెరికాలో ఫ్లోరిడాలో స్రవంతి కుటుంబం స్థిరపడినట్లు తెలిసింది. ఎలాంటి హడావుడి లేకుండా, ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావించింది. హైదరాబాద్లో అయితే సినీ రంగానికి చెందిన వారిని, ప్రముఖులను పిలవక తప్పదు, పిలవకపోవడం పద్ధతి కాదు. సుబ్బరాజు సొంతూరు భీమవరంలో పెళ్లి చేసుకున్నా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అందుకే.. అట్టహాసంగా చేసుకునే పెళ్లిళ్లపై అంత ఆసక్తి లేని సుబ్బరాజు, స్రవంతి అమెరికాలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి పిలుచుకున్నారు. సుబ్బరాజుకు సన్నిహితురాలైన సింగర్ స్మిత కూడా పెళ్లికి వెళ్లింది. సుబ్బరాజు, స్రవంతి పెళ్లి అమెరికాలో జరగడానికి కారణం ఇదే అని ఇండస్ట్రీ టాక్. అయితే.. అమెరికాలో పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ జంట భారతీయ సంప్రదాయాలను పక్కనపెట్టాలనుకోలేదు. చక్కగా తెలుగు కల్చర్లో సుబ్బరాజు, స్రవంతి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి సింపుల్గా చేసుకున్నప్పటికీ వివాహ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించే ఆలోచనలో సుబ్బరాజు ఉన్నట్లు తెలిసింది. సుబ్బరాజు, స్రవంతి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ పెళ్లి ఫొటోలను మీరు కూడా చూసేసి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలపండి.