ఏపీలో ఆసక్తికర ఘటన. పంతాలు పట్టింపులు ఏ విధంగా ఉంటాయో ఈ ఘటన చెబుతోంది. పల్నాడు జిల్లా గ్రంధసిరి గ్రామంలో గణేష్ శోభాయాత్ర సాగుతుంది. నవరాత్రుల తర్వాత గణేష్ నిమజ్జనానికి.. ట్రాక్టర్ పై ఊరేగింపుగా వెళుతున్నారు జనం.. ఈ మండపం నిర్వాహకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావటంతో.. అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు.
గణేష్ శోభాయాత్రను అడ్డుకున్నారు టీడీపీ వాళ్లు. వాగ్వాదానికి దిగారు. దీంతో వైసీపీ వర్గీయులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకున్నారు కదా.. మేం అసలు గణేష్ నిజమజ్జనమే చేయం.. మళ్లీ జగన్ సీఎం అయ్యే వరకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు గణేష్ నిమజ్జనం చేయం అని డిసైడ్ అయ్యారు.
నిమజ్జనానికి తీసుకెళుతున్న గణేష్ విగ్రహాన్ని తిరిగి మళ్లీ మండపంలోకి తీసుకొచ్చారు వైసీపీ వర్గీయులు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు.. జగన్ సీఎం అయ్యే వరకు విగ్రహాన్ని నిమజ్జనం చేయం అని.. ఎన్ని సంవత్సరాలు అయినా ఇక్కడే ఉంచుతామని డిసైడ్ చేశారు వైసీపీ అభిమానులు.