SSMB29: ఇది కదా మహేష్ ఫ్యాన్స్కు కావాల్సింది.. అద్దిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న రాజమౌళి..!

SSMB29: ఇది కదా మహేష్ ఫ్యాన్స్కు కావాల్సింది.. అద్దిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న రాజమౌళి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న #SSMB29 మూవీపై టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి లాంటి మూవీస్ తో టాలీవుడ్ మార్కెట్ ను పెంచిన రాజమౌళి.. RRR సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లారు. అలాంటి రాజమౌళి.. టాలీవుడ్ ప్రిన్స్, వైవిధ్యమైన కథలతో, తనదైన నటనతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే మహేష్ తో సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండటం కామన్.

అయితే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాడ్ కావడం తెలిసిన విషయమే. ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేశారు. అంతలోనే ప్రియాంక చోప్రా పర్సనల్ పనితో షూట్ కు గ్యాప్ ఇవ్వడం.. అదే టైమ్ లో జక్కన్న బంధువు మృతితో షూటింగ్ కు కొన్నాళ్లు విరామం ఇచ్చారు. 

అయితే ఇవాళ (ఫిబ్రవరి 24) అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్లీ షూటింగ్ రెజ్యూమ్ చేశారని తెలిసింది. కొన్ని షాట్స్ తీశారని టాక్. 

అయితే రాజమౌళి ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు అద్దిరిపోయే అప్ డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మూవీ పేపర్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లియర్ కట్ డీటైల్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు టీమ్. దీంతో త్వరలోనే రాజమౌళి.. మహేష్ బాబుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. 

ALSO READ : హిట్ 3 టీజర్ రిలీజ్.. వైల్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని ఊచకోత

మూవీలో ఉండే కీలక అప్ డేట్.. సినిమాకు హైప్ ఇచ్చే మ్యాటర్ వీలైనంత తొందర్లో రివీల్ చేయనున్నారట. ఈ మూవీలో నటించే బాలీవుడ్, హాలీవుడ్ తారాగణం తో పాటు.. మరేదో స్పెషల్ న్యూస్ ను ఫ్యాన్స్ కు చెప్పనున్నట్లు టాక్. మహేష్, రాజమౌళి.. కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తారంటే.. ఫ్యాన్స్ కు చాలా బిగ్ న్యూస్. ఈ వార్త తెలియగానే మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుందని అందరిలో ఒక ఉత్కంఠ మొదలైంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.. సినిమా గురించి ఏం చెబుతారో.