జనగామ బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టేజి పైన TSRTC చైర్మన్,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్వీట్ తినిపించి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి .. ముత్తిరెడ్డి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, జనగామలో ఆ వర్గం ఈ వర్గం అంటూ ఏమీ లేదని ఉన్నది ఒకటే వర్గం అది కేసీఆర్ వర్గం అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మిగిలి ఉన్న పనులను పూర్తిచేయాలని పల్లాకు చెప్పారు.
అలాగే 14 ఏళ్ల కాలంలో కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసి ఉంటే క్షమించాలని ముత్తిరెడ్డి కోరారు. కాగా పల్లా, ముత్తిరెడ్డిల మధ్య సయోధ్యను మంత్రి హరీష్ రావు కుదిర్చారు.
ALSO READ: కాంగ్రెస్కు అవకాశం ఇస్తే పాతాళంలోకి పోతాం : హరీష్ రావు