పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప 2 పై ఫ్యాన్స్కి భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 1 హిట్ తో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. స్టైలింగ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న “పుష్ప 2”. ఫస్ట్ లుక్ తో నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయింది. సెకండ్ పార్ట్ ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో కీలకంగా భావించే సన్నివేశాలను మూవీ బృందం షెడ్యూల్ చేసిందని సినీ సర్కిల్ లో టాక్. పోలీసులే ఈ సీన్ కి హైలెట్ గా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా పుష్ప ది రూల్ ను సుకుమార్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.