ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లినా, మనం చాలా తేలికగా మనకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం. ఇక చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.ప్రతిరోజూ బిస్కెట్లు తింటుంటాం. ఉదయం టీతో పాటు ...సాయంత్రం స్నాక్స్‌గానూ తీసుకుంటుంటాం. మరి బిస్కెట్స్‌ను తెలుగులో ఏమంటారో తెలుసుకుందాం..
రాను రాను జనాలు తెలుగు మర్చి పోతున్నారు... కాదు కాదు.. మర్చి పోయారు. నిద్ర లేస్తూనే మమ్మీ బిస్కట్.. డాడీ బిస్కట్ అంటూ లేస్తున్నారు. పట్టణాలకే కాదు.. పల్లెలకు కూడా ఈ సంప్రదాయం పాకింది. అందుకే ప్రతి నెల పచారీ సరుకులతో పాటు బిస్కట్ ప్యాకెట్లను కొంటుంటారు. బిస్కెట్ అనేది తెలుగు పదం కాదు.. కనీసం తెలుసుకుందాం అనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. ఎంతో ఇష్టంగా పిల్లలు, పెద్దలు తింటున్నా... దానిని తెలుగులో ఏమంటారో చాలామందికి తెలియదు. జనాలు పాశ్చాత్య సంస్కృతికి... విదేశీ భాషకు అలవాటు పడి మన తెలుగు పదాలను మర్చిపోతున్నారు. బిస్కెట్ ను తెలుగులో రొట్టెబిళ్ల అంటారు. దీనికి పర్యాపదంగా చక్కిలము అని కూడా అంటారని ఆంధ్రభారతి నిఘంటువు ద్వారా తెలుస్తుంది.
ఉదయాన్నే నిద్రలేచాక.. టీ తాగనిదే మనకు రోజు ప్రారంభం కాదు. ఆ టీతో పాటు బిస్కెట్స్ తినే వారు కూడా మనలో చాలా ఉంటారు.ముఖ్యంగా చిన్నపిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకొని తినేందుకు బాగా ఇష్టపడతారు. కొందరైతే దానినే బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా ఆకలిగా అనిపించినప్పుడుల్లా రెండు మూడు బిస్కెట్లు తీసుకొని తింటుంటారు.
అందువలన మార్కెట్‌లో బిస్కెట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే మనం బిస్కెట్స్ తింటూ ఉంటాం. అందుకే ఇంటి నుంచి వెళ్లేటప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకెళ్తుంటారు. సాయంత్రం పూట టీతో పాటు స్వీకరిస్తారు. ఈ కారణాల వల్లే బిస్కెట్స్‌కు మార్కెట్లో విపరితమైన డిమాండ్ ఉంది. బెస్ట్ స్నాక్ ఐటమ్‌గా పేరుంది. కొత్త కొత్త ఫ్లేవర్స్.. కొత్త కొత్త రూపాల్లో వస్తున్నాయి. సాదా బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, డ్రైఫ్రూట్ బిస్కెట్, ప్రొటీన్ బిస్కెట్.. అబ్బో చాలా వెరైటీలే ఉన్నాయి. కాని .కానీ ఆ బిస్కెట్‌ను తెలుగులో ఏమంటారో ఎవ్వరికీ తెలియదు.
ALSO READ :- నా హనీమూన్ సంగతి నీకెందుకు రా : టీవీ లైవ్ లో కొట్టిన సింగర్
చదువుకున్న వారే కాదు.. నిరక్ష్యరాసులు కూడా బిస్కెట్‌ను బిస్కెట్టనే పిలుస్తారు. బిస్కెట్, బిస్కీట్, బిస్కోటు.. ఎలా ఎన్ని రకాలుగా పిలుచుకున్నా.. అది బిస్కెట్టే. ఈ బిస్కెట్‌ని తెలుగులో ఎలా పిలుస్తారు? అసలు దీనికి తెలుగు పదం ఉందా? ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం.. బిస్కెట్‌ను తెలుగులో రొట్టెబిళ్ల అని పిలుస్తారట. చాలా విచిత్రంగా ఉంది కదూ. బిస్కెట్‌ను ఇలా అంటారని.. 99.9శాతం మందికి తెలియదు. అంతేకాదు బిస్కెట్‌ను అచ్చ తెలుగులో చక్కిలము అని కూడా అంటారట. కానీ మనలో ఎవరూ ఈ పేర్లతో పిలవరు.షాపుల్లోకి వెళ్లి చక్కిలం ప్యాకెట్... రొట్టెబిళ్ల ప్యాకెట్ అర్దం కాక లేదని చెప్పి పంపిస్తారు. కనీసం బిస్కెట్లు అమ్మేవారికి కూడా తెలుగులో ఏమంటోరో కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా పిలిచినా.. అందేంటని మిగతావరు నోరెళ్ల బెడతారు. బిస్కెట్‌ను బిస్కెట్ అని పిలిస్తేనే అందరికీ అర్ధమవుతుంది.