ముంబై: దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టడంతో ఆయన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు కొన్ని సోషల్ మీడియాలో కథనాలుగా వెలువడుతున్నాయి. నాగ్పూర్మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా పనిచేసిన రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగేవరకు ఫడ్నవీస్ ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు నిత్యం మీడియాలో వార్తలుగా వస్తూనే ఉన్నాయి. ఆ కోవకు చెందిన ఫడ్నవీస్ చిన్ననాటి ఘటనకు సంబంధించిన వార్తా ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ ఇందిరా కాన్వెంట్హైస్కూల్లో చదువుతున్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జైలుపాలయ్యారు. దీనికి నిరసనగా ఇందిరా గాంధీ పేరుతో ఉన్న తాను చదువుతున్న స్కూల్‌కు వెళ్లేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు. వెంటనే ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకుని సరస్వతీ విద్యాలయ పాఠశాలలో చేరారు. అంత చిన్న వయసులోనే ఇందిర పేరున్న స్కూల్‌కు వెళ్లేందుకు కూడా నిరాకరించిన ఫడ్నవీస్ ఆలోచనా తీరుకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాజకీయాల్లో రాణించేందుకు కావాల్సినన్ని లక్షణాలు చిన్నప్పటినుంచే ఫడ్నవీస్‌లో ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.