విక్రమ్(Vikram) సూపర్ హిట్ తరువాత కమల్ హాసన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలను ఒకే చేస్తూ యంగ్ హీరోలకు సైతం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో ఇండియన్2(Indian2) చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత కూడా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు కమల్ హాసన్. ఇండియన్2 తరువాత కమల్ హాసన్ తన 233వ సినిమాను దర్శకుడు హెచ్ వినోద్ తో ఓ సినిమా చేయనున్నారు. ఇక 234వ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో చేయనున్నారు కమల్. ఈ రెండు సినిమాలకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు మేకర్స్. వీటితో పాటు ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కల్కి సినిమాలో కూడా కీ రోల్ చేస్తున్నారు కమల్.
- ALSO READ | నేను అలాంటి పాత్రల్లో నటించను.. అందుకే ఈ నిర్ణయం
అయితే దర్శకుడు హెచ్ వినోద్ తో చేస్తున్న సినిమాపై ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు ఒక హిస్టారికల్ టైటిల్ ఫిక్స్ చేశాడట దర్శకుడు. అదే మర్మయోగి. కమల్ హాసన్ 2002లోనే ఈ టైటిల్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కథను హెచ్ వినోద్ తన సినిమా కోసం వాడుకోవాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ న్యూస్ తెలుసుకున్న కమల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.