రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. ప్రస్తుతం 57 స్థానాల్లో అధిక్యంలో ఉన్న ఇండియా కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ జార్ఖండ్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 45 సీట్ల మేజిక్ ఫిగర్ దాటి ఇండియా కూటమి స్పష్టమైన మెజార్టీ కనబరుస్తుండటంతో అధికార పార్టీ నేతలు సంబరాలు షూరు చేశారు. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి వరుసగా రెండో సారి విజయం సాధించిన నేపథ్యంలో జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ ఎక్స్ (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘‘మేరీ శక్తి’’ అంటూ తన ఇద్దరు కుమారులతో కలిసి గెలుపును ఆస్వాదిస్తోన్న ఫొటోను షేర్ చేశారు హేమంత్ సోరెన్. ఈ ఫొటోలో తన కుమారులతో కలిసి ఆనందంగా టైమ్ స్పెండ్ చేసిన సీఎం.. తన కుమారున్ని ఆప్యాయంగా హత్తుకున్నాడు. గెలుపును కుమారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హేమంత్ సోరెన్ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ లోని మొత్తం 81 స్థానాల్లో ప్రస్తుతం ఇండియా కూటమి 57 స్థానాల్లో.. ఎన్డీఏ కూటమి 23 సీట్లలో అధిక్యంలో ఉన్నాయి.
मेरी शक्ति pic.twitter.com/6NP6O6Vl7R
— Hemant Soren (@HemantSorenJMM) November 23, 2024