అప్పుడేమో పాస్ చేస్తమన్నరు.. ఇప్పుడేమో పరీక్ష రాయాలంటున్నరు

ఫస్టియర్​లో ఫెయిలైనోళ్లకు తిప్పలు

మినిమం మార్కులతో పాస్ చేస్తామని ప్రచారం

ఇప్పడు ఎగ్జామ్స్ రాయాలంటూ ఇంటర్ బోర్డు ఆర్డర్
ప్రతిరోజూ పరీక్ష ఎట్ల రాయాలని స్టూడెంట్స్ ఆవేదన

హైదరాబాద్, వెలుగు: గత మార్చి ఎగ్జామ్స్ లో ఫెయిలైన ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఈసారి ఇబ్బందులు తప్పేలా లేవు. నిన్నమొన్నటి వరకు మినిమమ్ మార్కులతో పాస్ చేస్తామని ప్రచారం చేసిన ఇంటర్ బోర్డు అధికారులు, పరీక్షల టైమ్ రాగానే అందరూ ఎగ్జామ్స్ రాయాల్సిందేనని ప్రకటించారు. దీంతో ఫస్టియర్​లో ఫెయిలైన 1.92 లక్షల మంది స్టూడెంట్స్​లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు సెకండియర్ ఉన్న వీరు ఈ కరోనా టైమ్​లో ఒక్క రోజు గ్యాప్​ లేకుండా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఎట్ల రాయాలని ప్రశ్నిస్తున్నారు.

స్టేట్​లో గతేడాది మార్చిలో జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 4,80,555 మంది ఎగ్జామ్స్ రాయగా, దాంట్లో 2,88,383 మంది పాసయ్యారు. మరో 1,92,172 మంది ఫెయిల్​ అయ్యారు. కరోనా వల్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టకపోవడంతో, సెకండియర్ స్టూడెంట్స్ అందరినీ మినిమమ్‌‌ పాస్ మార్కులతో పాస్ చేశారు. అయితే ఫస్టియర్​లో ఫెయిలైన వారి గురించి పట్టించుకోలేదు. తీరా ఎగ్జామ్​ఫీజు షెడ్యూల్​లో ఫస్టియర్​లో ఫెయిలైన వారంతా ఫీజు కట్టి, పరీక్షలు రాయాల్సిందేనని చెప్పుకొచ్చారు. అయితే మే ఫస్ట్ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సండే సహా పలు సెలవు రోజుల్లోనూ పరీక్షలు పెడ్తున్నట్టు షెడ్యూల్​లో పేర్కొన్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల క్లాసులు ఆన్​లైన్​లో సాగాయి. చాలామందికి పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండియర్ పరీక్షలు ఎలా పాస్ కావాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్​కు, ఇప్పుడు ఫస్టియర్​బ్యాక్​లాగ్స్ ఎగ్జామ్స్​ఎట్ల రాయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కు మరింత ఇబ్బందులు పడే అవకాశముంది. ఇంప్రూవ్ మెంట్ రాసుకునే స్టూడెంట్లను కూడా ఇదే సమస్య వేధిస్తోంది. కనీసం నెల రోజుల ముందుగా పరీక్షలు పెట్టినా రాసుకునే వారమని స్టూడెంట్స్ అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఫస్టియర్​లో ఫెయిలైన స్టూడెంట్స్​అందరినీ మినిమమ్ మార్కులేసి పాస్ చేయాలని స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

For More News..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే స్టడీ లోన్స్

జనవరిలో మనోళ్లు మస్తు తాగిన్రు.. ఒక్క నెలలోనే లిక్కర్ సేల్స్ 2,633 కోట్లు

నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్

భర్తను చంపినా.. భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే