90 రోజుల ప్రణాళికలను అమలు చేయాలి : షేక్​ సలాం

90 రోజుల ప్రణాళికలను అమలు చేయాలి : షేక్​ సలాం
  • ఇంటర్​ జిల్లా నోడల్​ అధికారి షేక్​ సలాం

 

లింగంపేట,వెలుగు : ఇంటర్​ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇంటర్మీడియెట్​బోర్డు  ప్రవేశపెట్టిన 90 రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఇంటర్మీడియెట్​ జిల్లా నోడల్​అధికారి షేక్​ సలాం  అన్నారు. లింగంపేటలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజి, మైనార్టీ, జ్యోతిబాపూలే, కస్తూర్బా గాంధీ గురుకుల కాలేజీలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరులోగా  సిలబస్ పూర్తి చేయాలన్నారు.    

సిలబస్ రివిజన్​తో పాటు ప్రతీరోజూ సబ్జెక్టులోని  ఒక ప్రశ్నకు జవాబు రాసేవిధంగా టెస్టు పెట్టి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు.   అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు.  కాలేజీ ప్రిన్సిపాల్​నరేందర్, లెక్చరర్లు దుర్గయ్య,శివ, నాగు, స్వామిగౌడ్​, ధర్​సింగ్, అంజమ్మ, రాజయ్య, వాణి, రజాక్, అభినవ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.