- ఇంటర్ ఎగ్జామ్స్ మే 1 నుంచి
- 1న ఫస్టియర్, 2న సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం
- ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్
- షెడ్యూల్ రిలీజ్ చేసిన మంత్రి సబిత
- ఒకేషనల్ కోర్సులకూ ఇదే షెడ్యూల్
హైదరాబాద్, వెలుగు: మే 1 నుంచి 20 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి 19 వరకు ఫస్టియర్, 2 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనుండగా.. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. మొదట మే 3 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభించాలని షెడ్యూల్ రూపొందించినప్పటికీ, టెన్త్ షెడ్యూల్ కు అనుగుణంగా మార్చాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
తొందరపాటు చర్య: ఇంటర్ విద్య జేఏసీ
ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటన తొందరపాటు చర్య అని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి మండిపడ్డారు. ఫిజికల్ క్లాసులు వచ్చే నెల ఫస్ట్
నుంచి ప్రారంభం కానున్నాయని, అయితే కేవలం 30 రోజులు మాత్రమే స్టూడెంట్లు క్లాసులు వినే అవకాశం ఉందని చెప్పారు. ఆ టైమ్ లో ఎంత సిలబస్ పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఆన్లైన్ పాఠాలు స్టూడెంట్స్‌కు సరిగా అర్థం కాలేదని చెప్పారు.
ఫస్టియర్ షెడ్యూల్..
తేదీ ఎగ్జామ్
మే 1 సెకండ్ లాంగ్వేజీ పేపర్‑1
3 ఇంగ్లిష్ పేపర్-1
5 మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1 , సైకాలజీ పేపర్‑1
7 మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
10 ఫిజిక్స్- పేపర్‑1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజీ పేపర్‑1
12 కెమిస్ట్రీ పేపర్‑1, కామర్స్ పేపర్‑1, సోషియాలజీ పేపర్‑1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్‑1
17 జియాలజీ పేపర్‑1, హోంసైన్స్ పేపర్‑1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్‑1, లాజిక్ పేపర్‑1, బ్రిడ్జి కోర్సు గణితం పేపర్‑1
19 మోడ్రన్ లాంగ్వేజీ పేపర్‑1, జాగ్రఫీ పేపర్‑1
సెకండియర్ షెడ్యూల్
తేదీ ఎగ్జామ్
మే 2 సెకండ్ లాంగ్వేజీ పేపర్–2
4 ఇంగ్లిష్ పేపర్-2
6 మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్–-2, సివిక్స్- పేపర్‑2, సైకాలజీ పేపర్‑2
8 మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‑ 2, హిస్టరీ- పేపర్‑2
11 ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్- పేపర్‑2, క్లాసికల్ లాంగ్వేజీ పేపర్‑2
13 కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్- పేపర్‑2, సోషియాలజీ పేపర్‑ 2, ఫైన్ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్‑2
18 జియాలజీ పేపర్‑2 , హోంసైన్స్ పేపర్‑ 2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్‑2, లాజిక్ పేపర్‑2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‑2
20 మోడ్రన్ లాంగ్వేజీ పేపర్‑2, జాగ్రఫీ పేపర్‑2
For More News..