Inter Exams : మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు

Inter Exams : మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు
  • ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ 
  • జనవరి 31, ఫిబ్రవరి 1న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ 
  • ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. వచ్చే ఏడాది మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య షెడ్యూల్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, సెకండియర్ స్టూడెంట్లకు మార్చి 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎగ్జామ్స్‌‌‌‌ ఉంటాయని వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ స్టూడెంట్లకు జనవరి 29న ఇంటర్‌‌‌‌ ఎథిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌ వాల్యూస్‌‌‌‌ పరీక్ష ఉంటుందన్నారు. 30న ఎన్విరాన్‌‌‌‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని చెప్పారు. ఈ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్‌‌‌‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌‌‌‌ ప్రాక్టికల్స్‌‌‌‌ జనవరి 31న, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి1న పెట్టనున్నట్టు పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్.. 

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రాక్టికల్స్ రెండో శనివారం, ఆదివారం కూడా ఉండనున్నాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. 

ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్.. 

తేదీ                పేపర్ 
మార్చి 05        సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 07        ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 11        మ్యాథమెటిక్స్ 1ఎ, బోటనీ-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
మార్చి 13        మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ-1, హిస్టరీ పేపర్-1
మార్చి 17        ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 19        కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1
మార్చి 21        పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-1
మార్చి 24        జాగ్రఫీ-1, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1
సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్.. 
మార్చి 06        సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 10        ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 12        మ్యాథమెటిక్స్ 2ఏ, బోటనీ-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
మార్చి 15        మ్యాథమెటిక్స్​2బీ, జువాలజీ-2, హిస్టరీ పేపర్-2
మార్చి 18        ఫిజిక్స్-2, ఎకనామిక్స్ పేపర్-2 
మార్చి 20        కెమిస్ట్రీ-2, కామర్స్ పేపర్-2 
మార్చి 22        పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-2
మార్చి 25        జాగ్రఫీ-2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2