మార్చ్ 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

మార్చ్ 5  నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

హనుమకొండ/జనగామ/ ములుగు, వెలుగు: ఇంటర్మీడియెట్​పబ్లిక్​ఎగ్జామినేషన్స్ నిర్వహణపై  జిల్లా అధికారులు ఫోకస్​ పెట్టారు. ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ పరీక్షలు జరగనుండగా, ఆఫీసర్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్​ విద్యార్థులు 37,877 మంది ఉండగా, ఫస్ట్​ ఇయర్​ 18,397 మంది, సెకండ్​ ఇయర్​ 19,480 మంది ఉన్నారు. ఒకేషనల్​ గ్రూపులకు సంబంధించి 2,103 మంది ఉండగా, అందులో ఫస్ట్​ ఇయర్​ విద్యార్థులు 1,146 మంది, సెకండ్​ ఇయర్​ లో 957 మంది ఉన్నారు. 

ఈ మేరకు పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్​ టీమ్ లు,, సిట్టింగ్ స్క్వాడ్స్ 4, చీఫ్​ సూపరింటెండెంట్లు 55 మంది, డిపార్ట్​మెంటల్​ ఆఫీసర్లు 55 మంది, అడిషనల్​ చీఫ్​ సూపరింటెండెంట్స్​ 42 మందిని నియమించారు. జనగామ జిల్లాలో మొత్తం 17 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్​ అధికారి జితేందర్​రెడ్డి తెలిపారు.

మొత్తంగా 8945 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 4251 మంది ఫస్ట్​ ఇయర్, 4694 మంది సెకండ్​ ఇయర్​ స్టూడెంట్లు ఉన్నట్లు వివరించారు. ఇంటర్​ పరీక్షల నేపథ్యంలో ములుగు కలెక్టర్​ దివాకర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3,793 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు.