ఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అయితే కొంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా  ఇంటర్ ఫెయిల్ అయినందుకు ఇద్దరు అమ్మాయిలు తనువు చాలించారు. మెదక్ జిల్లా శేరిపల్లిలో ఇంటర్ సెకండియర్ బాలిక పంబాల రమ్య ఉత్తీర్ణత సాధించలేదు. 

మనస్తాపానికి గురైన ఆమె.. గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండలో వాకదాని వైశాలి (17) ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదువుతుంది. ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై..   ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఫెయిలైతే సప్లిమెంటరీలో పాస్ కావొచ్చు కానీ జీవితం తిరిగి రాదంటూ లెక్చరర్లు చెబుతున్నారు.