హైదరాబాద్ , వెలుగు: ఇంటర్మీడియట్ సిలబస్ లో కోత పెట్టేందుకు ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ ను తగ్గించింది. అదేబాటలో ఇప్పుడు ఇంటర్ బోర్డు వెళుతోంది. ఇంటర్ పాఠాల్లో 30% సిలబస్ కు కోతపెట్టనున్నారు. మూడు విధాలుగా సిలబస్ ను తగ్గించే అవకాశముంది. సీబీఎస్ఈ బోర్డు 11, 12 తరగతుల్లోని సైన్స్ కోర్సుల్లో సిలబస్ .. దాదాపు అంతా తెలంగాణ ఇంటర్ సైన్స్ పుస్తకాల్లో ఉంది. కాబట్టి సైన్స్ లో సీబీఎస్ఈ తొలగించిన పాఠాలన్నింటినీ రాష్ట్రంలోనూ తీసేయనున్నారు. ఇంటర్ ఆర్ట్స్ కోర్సుల్లో కొంత సీబీఎస్ఈలోని సిలబస్ కూడా ఉంది. దీంతో అక్కడ తొలగించిన సిలబస్ తీసేశాక కూడా అనుకున్న 30 శాతానికి చేరకపోతే.. ఉపయోగం లేని కొన్ని పాఠాలను తొలగించే అవకాశముంది. లాంగ్వేజీ పుస్తకాల్లో గ్రామర్, పొయెట్రీని కొంత తొలగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
For More News..