అధికార పార్టీలో వర్గపోరు

వరంగల్ లోని 23వ డివిజన్ లో జరిగిన పట్టణ ప్రగతి లో అధికార పార్టీలో వర్గపోరు బయటపడింది. కొత్తవాడ, ఆటో నగర్ సమీపంలోని స్మశాన వాటిక సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కార్పొరేటర్ లేకుండా పరిశీలనకు ఎలా వస్తారంటూ ఎమ్మెల్సీని నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వర్గీయులు, ఎమ్మెల్సీ, మేయర్ వర్గీయుల మద్య ఏర్పడిన వాగ్వాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు కల్పించుకుని ఇరువురిని మందలించడంతో వివాదం సద్దు మణిగింది.