జనగామ జిల్లాలో సుఫారీ పాలిటిక్స్

జనగామ  జిల్లాలో  సుఫారీ పాలిటిక్స్

 జనగామ జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు రచ్చకెక్కాయి.  జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్సెస్ కంచె రాములు మద్య వర్గపోరు కొనసాగుతోంది.

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న  కోవర్టు నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి . ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ను  కలిసి ఫిర్యాదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు..    సుఫారీ హత్యలు చేసే వారితో జతకట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు కొమ్మూరి . కంచె రాములు పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారని.. అందుకే  తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు కొమ్మూరి.

జనగామ  జిల్లా కాంగ్రెస్ లో ముగ్గురు కోవర్టు నేతలు కంచె రాములు, ఎర్రమళ్ళ సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు కొమ్మూరి. వీళ్లే తన ఓటమికి కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పల్లాతో కుమ్మక్కై పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని  కోరారు.  తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే కంచె రాములు కొమ్మూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిజిందే.