ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి..
ఇవాళ (సెప్టెంబర్ 13న) జరిగిన సత్తుపత్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. నియోజకవర్గానకి చెందిన మానవతారాయ్, మట్టా దయానంద్ వర్గం ఒకిరిపై ఒకరు దాడులకు దిగారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎదుటే బాహాబాహీకి దిగారు. పోటాపోటీగా నినాదాలు చేస్తూ కుర్చీలతో కొట్టుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో రేణుకాచౌదరి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.