
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ఆసుపత్రిలోని ట్రామా బ్లాక్ఐదో అంతస్తులో ఈ నెల 19న జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటర్నల్ఎంక్వైరీ చేయిస్తున్నారు. నిమ్స్డైరెక్టర్బీరప్ప నలుగురు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ప్రొఫెసర్లు, ఆఫీస్సూపరింటెండెంట్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు.
అగ్ని ప్రమాదానికి కారణాలపై ఆరా తీయనున్నారు. ప్రమాదానికి కారకులు ఎవరు? ఆరోగ్యశ్రీ గదిలో పటాకులు ఎందుకు ఉన్నయ్? పటాకులను వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్చేసింది ఎవరు? వాటిని అక్కడ ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? ప్రమాదం జరిగాక ఎవరు తీసుకుపోయారు? అనే కోణాల్లో విచారించి నివేదిక ఇవ్వాలని బీరప్ప ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.