నెల్లూరు టీడీపీలో వర్గపోరు.. ఉద్రిక్తతకు దారి తీసిన తోపులాట.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో 4రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా టీడీపీలో వర్గపోరు బయటపడింది. నెల్లూరు జిల్లా నాగులమెట్లలో టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే అబ్యర్థి ఆనం రాంనారాయణ కింద పడ్డారు.

స్థానిక నేతలు రవీంద్ర నాయుడు మాజీ ఎమ్మెల్యే కేశవ చౌదరి వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆనం రానారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాలని అనుకున్నాడు రవీంద్ర నాయుడు. దీంతో ఆనం రాంనారాయణ కేశవ చౌదరి ఇంటికి వెళ్లకుండా  రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లటంతో గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది.