హైదరాబాద్ లో జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. రాష్ట్ర టూరిజం శాఖ పరేడ్ గ్రౌండ్లో ఫెస్టివల్ ని నిర్వహిస్తోంది. హైదరాబాద్ కి వస్తున్న ఇండోనేషియా స్విజర్లాండ్ ఆస్ట్రేలియా, శ్రీలంక ఇటలీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కైట్ ఫ్లెయిర్స్ జనవరి 13 ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన చేయనున్నారు.
కైట్స్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ పిండి వంటలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 700 మంది హోం మేకర్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. కైట్స్ అండ్ స్పీచ్ ఫెస్టివల్ కి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని చెప్పారు. మూడు రోజులపాటు లక్షమంది పైనే హాజరవుతున్నట్లు అంచనా వేశారు మంత్రి జూపల్లి.
ALSO READ | సంక్రాంతి రష్.. గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మాదిరి గానే..
మరోవైపు స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్ లో అందుబాటులో ఉంచనున్నారు నిర్వాహకులు. వీటితో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉండనున్నాయి. సందర్శకులెవ్వరికీ అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతరశాఖల అధికారులు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు.