వెలుగు కార్టూనిస్ట్​కు ఇంటర్నేషనల్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: ‘వీ6 వెలుగు’ కార్టూనిస్ట్ జే.వెంకటేశ్ (జేవీ) అంతర్జాతీయ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇటలీలోని స్పిలిమ్‌‌ బెర్గో నుంచి సంస్థ ఆర్గనైజర్లు ఆయనకు సమాచారం ఇచ్చారు. ‘‘ఫాక్స్ ఫర్ పీస్ – ఫాక్స్ ఫర్ టాలరెన్స్” అంశంపై ఇటలీలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆర్టిస్ట్ కేటగిరిలో జేవీ ఫస్ట్ ప్రైజ్​కు ఎంపిక కాగా, డిసెంబర్ 1న స్పిలిమ్ బెర్గోలో అవార్డు ప్రదానం ఉంటుందని, మెమోంటోతో పాటు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుడు నవంబర్ 19 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఎంట్రీలకు అవకాశం ఇవ్వగా, జేవీ తన రెండు ఆర్ట్స్​ను ఫిబ్రవరిలో ఆర్గనైజర్లకు పంపించారు. జ్యూరీ సభ్యులు విజేతలను ఫైనల్ చేశారు.

ALSO READ :  సంజయ్.. నమ్మినోళ్లను నట్టేట ముంచిండు : గంగుల కమలాకర్