ఆల్కహాల్ బేవరేజెస్లో బీరుకు ఉండే రేంజే వేరు. మందుబాబులు బీర్లను మంచినీళ్లు తాగినట్టు తాగేస్తుంటారు. బాటిళ్లకు బాటిళ్లు లేపేస్తుంటారు. ఎత్తిన బీరు దించకుండా తాగే వాళ్లు కొందరైతే, నిదానమే ప్రదానం అంటూ బాటిళ్లకు బాటిళ్లు తాగేవాళ్లు ఇంకొందరు. నేడు ఇంటర్నేషనల్ బీర్ డే. ప్రతి ఆగస్ట్ లోని మొదటి శుక్రవారాన్ని అంతర్జాతీయ బీరు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 207 నగరాల్లో, 80 దేశాల్లో, 6 ఖండాల్లో ఈ ఇంటర్నేషనల్ బీర్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్తో కలిసి బీర్ తాగుతూ చిల్ అవుతూ ఈ ఒక్కరోజు బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఉండటమే ఈ ఇంటర్నేషనల్ బీర్ డే ఉద్దేశం.
నేటి కాలంలో మద్యపానం అనేది చాలా మందికి అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపిక. చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి, విశ్రాంతిని పొందడానికి కోల్డ్ బీర్‌ను తీసుకుంటారు. కేవలం 5 నుంచి 10 -12 శాతం ఆల్కహాల్ ఉన్న బీర్ ఇతర ఆల్కహాలిక్ పానీయాల కంటే తక్కువ హానికరం. బీర్ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, నొప్పి తగ్గుతుందని, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అనేక పరిశోధనల్లో తేలింది. దీన్ని ఎక్కువగా లేదా క్రమం తప్పకుండా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి హానికరం. మరి ప్రతి రోజూ బీర్ తాగితే ఏం జరుగుతుందో ఇంటర్నేషనల్ బీర్ డే సందర్భంగా తెలుసుకుందాం.
రోజూ బీరు తాగితే వచ్చే నష్టాలు :
బీరు రోజూ తాగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆఫీసు ముగించుకుని రాత్రి సమయాల్లో ఎక్కువ మంది తాగుతారు. దీని వల్ల రాత్రి సమయాల్లో నిద్ర పట్టదు. ఉదయానికి హ్యాంగోవర్ గా ఉంటుంది.
బీర్ మూత్రవిసర్జన మరియు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కిడ్నీలుత్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
డీహైడ్రెషన్ కు కారణమవుతుంది.
రోజూ బీరు తాగడం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కారణంగా కిడ్నీ స్టోన్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
రోజూ బీరు.. నిద్ర, ఆకలి.. రెండింటినీ పాడు చేస్తుంది.
రోజూ బీరు తాగటం వల్ల దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్యతోపాటు కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతుంది.
రోజూ బీరు తాగటం వల్ల బీపీ.. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
బీరు ఎప్పుడెప్పుడు.. ఎంతెంత తాగాలి :
బీరులో ఆల్కాహాల్ శాతం కనీసం 5 నుంచి 12 శాతం వరకు ఉంటుంది.
బీరు తాగటానికి సమయం అంటూ ఏదీ నిర్ధిష్టంగా లేదు. కాకపోతే దేశంలోని బీరు ప్రియులు 90 శాతం మంది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య తాగుతున్నారు.
దీన్ని వారానికి ఒక్కసారి.. అది కూడా ఒకటి, రెండు బీర్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.
వారంలో నాలుగు బీర్ల కంటే ఎక్కువ తాగితే మాత్రం దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి.. వారానికి ఒకటి, రెండు.. అది కూడా ఒక రోజు తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపదని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీరును అధికంగా తీసుకుంటే హాని, అనారోగ్య సమస్యలు, వ్యాధులే.