International Beer Day : బీర్​ ఎలా పుట్టింది.. దానిని మహిళలే తయారు చేశారట..

International Beer Day :  బీర్​ ఎలా పుట్టింది..  దానిని మహిళలే తయారు చేశారట..

 బీర్ అనేది ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా  సేవించే ఆల్కహాల్‌ డ్రింక్స్‌లో ఒకటి.  మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసా?అసలు బీరుకు ఓ రంగును..రూపుని..రుచిని ఇచ్చింది. తెచ్చింది అంతా మహిళలే నని మీకు తెలుసా?  ఈరోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టుపూర్వోత్తరాలు..దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.. 

 బీరును తయారు చేసింది, చరిత్రలో ఆ పానీయానికి పెద్ద ఎత్తున్న ప్రాముఖ్యత కల్పించింది.. అంతర్జాతీయంగా ప్రచారం చేసింది.. ఇప్పుడు మార్కెట్‌లో  రంగు రంగుల బాటిళ్లలో అమ్ముడుపోతున్న బీరుకు ఒక రూపం తెచ్చిపెట్టింది.. అంతా ఆడవాళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ‘బీర్‌ డే’ సందర్భంగా అలనాడు బీరును తయారు చేసిన మహిళామణులకు జోహార్లు చెబుతూ బీరు డే శుభాకాంక్షలుచెబుతూ బీరు పుట్టుక గురించి తెలుసుకుందాం..

మంచైనా.. చెడైనా.. పండగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. సంతోషం వచ్చినా.. దు:ఖం వచ్చినా.. చాలా మంది  ఓ బీరు వేద్దాంరా ... అని నేటి తరం యువత నుంచి పెద్దవారి వరకూ అనుకుంటారు... అనుకోవటమే కాదు ఓ బీరు తాగి పడుకుంటారు. అయితే    సారా తయారు చేసినవాడు ఎవడో గానీ..నా సామిరంగా.. వాడు మహా మేధావి అయ్యి ఉంటాడని.. బీరు రుచి మరిగిన.. గ్రీకు తత్వవేత్త ప్లాటో అన్న మాటలివి... మరి బీరు తాగిన మత్తులో చెప్పాడో..లేదా బీరు మత్తు గురించి చెప్పాడో గానీ ...నిజంగా బీరులో మునకేసి మరీ చెప్పిఉంటాడాయన.  

సుమారు 7వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అప్పట్లో ఆడవాళ్లు బలవర్థకమైన ఆహారం .. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్‌ అని అంటున్నామే దాని కోసం అంబలి కాచుకునేవారు. అంబలి అంటే అందరూ కాచుకునేదే. కానీ కొంతమంది మరీ డిఫరెంట్ గా కాస్తారు కదా..

అలా కొంతమంది ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను కూడా కలిపి వాటిని నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసేవారు. అలా మరిగించిన ఆ పానీయాలను నిల్వ చేసేవారు. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి మారేది. అది తాగితే లైట్ గా మత్తుగా మధురంగా ఉండేది. అందుకే అప్పట్లో వాటిని మత్తు ద్రావణాలు అని అనేవారు.  ఆ మత్తు వారికి బాగుండేది.ఏదో లోకంలో విహరించినట్లుగా వింతగా..సరదాగా ఉండేది. దాంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.

అలా బీరు అమ్మకాల సంప్రదాయం వేల సంవత్సరాల క్రితమే మొదలైందన్నమాట. ఏదైనా కొత్తగా తయారుచేశాక వాటికి ఇంకొంత కొత్తదనాన్ని జోడించటం సర్వసాధారణమే కదా..అలా ఆ పానీయాలకు మరింత రుచిని జోడించి తయారుచేసేవారు మహిళలు. అలా అలా కొత్తరకం రుచి జోడవవ్వటంతో ఆ పానీయాలకు మార్కెటింగ్‌ పెంచారని బ్రిటిష్‌ చరిత్రకారుడు సొమ్మెలియర్‌ జేన్‌ పెయిటోన్‌ తెలిపారు. 

ఈజిప్షియన్లు ఆ కాలంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు మద్యం సేవించేవారు.  దీంతో మద్యం ఇళ్లలోనే మద్యాలను తయారు చేసుకునేవారు. ఆ సమయంలో బీర్‌లాంటి పానీయాలు చెలామణిలో ఉండేవని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి నీళ్లు, టీ,కాఫీ తర్వాత ఎక్కువ  మంది బీరే తాగుతారు. 

సన్యాసిని చొరవ..బీరుకు కొత్త లుక్..

అలా మధ్యయుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం బాగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల వరకూ అంతా వాటికి అలవాటుపడ్డారు. కానీ పులిసిన ఆ పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు. పాచి వాసన వచ్చేవి. దీంతో రకరకాల ప్రయోగాలకు తెరతీశారు. అలా పలు ప్రయోగాల్లో భాగంగా గంజాయి మొక్కలకు చెందిన హోప్స్‌ మొక్క పువ్వులను వేచి కాచేవారు. అవి ద్రావణాలను పాడుకాకుండా ఉంచడంతో పాటు మత్తు పాళ్లు కాస్త పెరిగాయి. అలా బీరులోకి కిక్ మొదలైందన్నమాట. 

జర్మనీకి చెందిన ఓ సన్యాసి.. హిల్డెగార్డ్‌ ఆఫ్‌ బింగెన్‌(హిల్డెగార్డ్‌) విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్‌కు ఒక రూపం తీసుకొచ్చింది. అయితే బలవర్థకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం మగవాళ్లకేనని. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కనపెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను ఎక్కించటం మొదలుపెట్టారు. అలా బీర్‌ వెనుక ఆడవాళ్ల కృషిని తెర వెనక్కి నెట్టేసి.. అప్పటి నుంచి బీర్ల పరిశ్రమలో కింగ్‌లుగా చెలామణి అవుతున్నారు మగవాళ్లు. కానీ బీరు వెనుక అసలు కథ మాత్రం ఆడవాళ్లదేనని మాట మరుగున పడిపోవటంతో పాటు అసలు ఆడవాళ్ల మాటే లేకుండా పోయింది.

ఇంటర్నేషనల్‌ బీర్‌ డే పుట్టు పూర్వోత్తరాలు

ఆగస్టు మొదటి శుక్రవారం. అంతర్జాతీయ బీరు దినోత్సవం (International Beer Day) ఎలా పుట్టిందో, ఇంతకీ బీర్‌ డే ఉద్దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడుతే నాలుగు పెగ్గులు వేస్తూ నాలుగు బీరు బాటిల్స్ లాగించేయటమే ఈ బీర్ డే స్పెషల్. బీర్‌ ప్రియుల కోసం బీర్‌కు జరిపే పుట్టిన రోజు ఇది. 2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్‌ అనే తాగుబోతు.. ఈ బీర్‌ డే పుట్టుకకు కారణం. అది ఓ మందుబాబు పుణ్యం అన్నమాట. 2012 దాకా ఆగష్టు 5నే ఇంటర్నేషనల్‌ బీర్‌ డేను జరిపేవారు.

అయితే ఆ తర్వాత ఆగష్టు మొదటి శుక్రవారంను బీర్‌ డేగా నిర్వహించుకోవాలని మందుబాబులకు పిలుపునిచ్చాడు జెస్సే. అలా పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈరోజు( 2024 ఆగస్టు 2) .. ఇప్పుడు దాదాపు 80కిపైగా దేశాల్లో జరుగుతోంది. ముఖ్యంగా 200 నగరాల్లో ఈ బీర్‌ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మందుబాబులు. ఆ లిస్ట్‌లో మన భారత కూడా ఉంది. కాగా బీరు తాగాలా వద్దా? అనేది వారి వారి ఇష్టం. వద్దంటే మానేయరు..తాగమంటే తాగేయరు..బీరు గురించి ఇన్ని విషయాలు విశేషాలు చెప్పాక..ఓముఖ్యమైన విషయం చెప్పటం ధర్మం..అదే  మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.....