నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం

నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం
  •  
  • హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే
  • వరల్డ్ టూరిజం హబ్ గా అభివృద్ధి
  • ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్, 
  • హుస్సేన్​ సాగర్​ కలిపి ఒకే టూరిజం సర్క్యూట్
  • హైదరాబాద్–నాగార్జున సాగర్ హైవే విస్తరణ
  • గోల్కొండ కోట చుట్టూ రోడ్ల వెడల్పు

హైదరాబాద్: నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి బుద్ధ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాగార్జున  సాగర్ టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా హైదరాబాద్–నాగార్జున సాగర్ మధ్య ఫోర్ లేన్ రహదారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ చుట్టూ స్కై వాక్ వే నిర్మించాలని నిర్ణయించారు. 

ట్యాంక్​ బండ్​,  తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారం లో స్కై వాక్ వే  డిజైన్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో  అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్​ కోర్టులు, వివిధ స్టాళ్ల ను ఏర్పాటు  చేసి  ఈ ప్రాంతాన్ని సిటీ లో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధారామాలు, పర్యాటక స్థలాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు.  చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​ సాగర్​లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దేశ విదేశాల్లోని టూరిస్టులను ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్​లో భాగంగా  బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది.  టితో పాటు తాజాగా ఇంటర్నేషనల్​ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళిక లో భాగం చేయనుంది. 

స్పిరిచువల్ డెస్టినేషన్ సెంటర్‌గా సాగర్ 

నాగార్జున సాగర్ లోని బుద్దవనాన్ని టూరిజం హబ్ గాను, స్పిరిచువల్ డెస్టినేషన్ సెంటర్ గానూ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. నాగార్జున సాగర్ డ్యామ్​ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి  చేస్తారు. నాగార్జున సాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించనున్నారు.

గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లు వెడల్పు చేయాలి

గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.  ఆక్రమణలుంటే  తొలగించాలని, అక్కడున్న ఇండ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.