అట్టహాసంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్​ థియేటర్ ​ఫెస్ట్

అట్టహాసంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్​ థియేటర్ ​ఫెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో మూడురోజుల ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్​థియేటర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. 

ఈ ఫెస్టివల్​ద్వారా థియేటర్ డ్రామాను ప్రమోట్ చేయడంతోపాటు, హైదరాబాద్ చెందిన యంగ్ డ్రామా ఆర్టిస్ట్ లను ఎంకరేజ్ చేస్తున్నామని నిశుంబిత స్కూల్ ప్రతినిధి దేవిక దాస్ తెలిపారు. ప్రతి రోజు వివిధ థీమ్ లతో ఆరు షో లు ఉంటాయన్నారు. సోమవారం చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చదువు పేరుతో తల్లిదండ్రులు పిల్లలపై చేస్తున్న ఒత్తిడిని వివరిస్తూ చిన్నారులు చేసిన ప్రదర్శన ఆలోచింపజేసింది.