పిల్లలకీ హక్కులున్నయ్​!

పిల్లలకీ హక్కులున్నయ్​!

ముద్దులొలికే పాప… అప్పటి వరకు ఆనందంగా ఆడుకొని  అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రలోకి వెళ్లింది. కామంతో కళ్లు మూసుకుపోయినవాడు
ఆ పసికూనపై కన్నేశాడు.  తల్లికి శాశ్వతంగా కడుపుకోత మిగిల్చాడు.  చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు, పిల్లల విషయంలో వికృత చేష్టలతో సమాజంలో చీడపురుగులు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. 

మనకు చిల్డ్రన్​ డే అంటే నవంబర్​ 14న పండిట్​ నెహ్రూ పుట్టినరోజును జరుపుకోవడమే తెలుసు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సల్ చిల్ర్డన్ డేని నవంబర్ 20 వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1959లో ఈ స్పెషల్​ ఈవెంట్​ని ప్రకటించింది. పిల్లల హక్కులు, వారి మనుగడ, గుర్తింపు, ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, అభివృద్ధి, విద్య, వినోదం, కుటుంబం, పెరిగే వాతావరణం వంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయి. అలాగే, వాళ్ల పట్ల నిర్లక్ష్యం చూపడం, చైల్డ్​ ట్రాఫికింగ్, అత్యాచారాలు​ మొదలైనవి నివారించడం బాలల హక్కులుగా భావిస్తారు.  వీటి అమలును ‘రైట్స్ ఆఫ్ ద చైల్డ్ కమిటీ’ పర్యవేక్షిస్తుంది.

మొదటి ట్రీటీలోని నాలుగు అంశాలు :

జీవించే హక్కు: ఈ హక్కు కిందకు కనీస అవసరాలైన ఆహారం, నివాసం, లైఫ్​ స్టయిల్, మెడికల్​ ట్రీట్​మెంట్​ వస్తాయి.

అభివృద్ది హక్కు : పిల్లలు ఎడ్యుకేషన్​, స్పోర్ట్స్, లీజర్​ టైమ్​, కల్చరల్​ యాక్టివిటీ,  రైట్​ టు ఇన్ఫర్మేషన్​, ఫ్రీ థింకింగ్​ వంటివి ఉన్నాయి.

భద్రత హక్కు : పిల్లలను అన్ని రకాలుగా ఎక్స్​ప్లాయిట్​ చేయడం, వాళ్లను గాలికి వదిలేయడం వంటి చర్యల నుంచి భద్రత లభిస్తుంది. హోమ్స్​లో చేరే పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ద, జువెనైల్​ బాలలకు లీగల్​ ప్రొటెక్షన్​ వంటివి ఉంటాయి.

పార్టిసిపేషన్​ రైట్​ : పిల్లలు తమ ఆలోచనలను, ఉద్దేశాలను చెప్పగలిగే స్వేచ్చను అందిస్తుంది.

ఇండియాలో చైల్డ్​ ప్రొటెక్షన్​కి, వారి ఎదుగుదలకు, హక్కులకు 2007లో ‘చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ కమిషన్’ అనే రాజ్యాంగబద్దమైన సంస్థను ఏర్పాటు చేశారు.  చైల్డ్​ రైట్స్​ ప్రొటెక్షన్​కి టోల్ ఫ్రీ నంబరు 1098 కూడా ఉంది.

– డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, టీచర్

యూనివర్శల్ చిల్ర్డన్ డే..

పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించడం, వారి అవసరాలను అంచనా వేయడం, పెద్దవాళ్లకు లభించే మానవ హక్కులన్నీ వర్తింపచేయడం, పిల్లలకు సొసైటీలో స్పెషల్​ ట్రీట్​మెంట్​ ఇవ్వడం, సెక్యూరిటీ ఇవ్వడం, చైల్డ్​ రైట్స్​పై చైతన్యం కలిగించడం, వారిలోని క్రియేటివిటీని వెలికి తీయడం, జీవితం పట్ల భరోసాను కల్పించడం, మైనారిటీ తీరేవరకు  తల్లిదండ్రుల బాధ్యతను తెలియజేయడం వంటివి యూనివర్సల్​ చిల్డ్రన్​ డే ఉద్దేశాలు. ఇంకా పిల్లల ట్రాఫికింగ్​వంటి విషయాలలో సోషల్​ రెస్సాన్సిబులిటీని ప్రచారం చేస్తారు.  ఇండియాలో పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఉచిత నిర్భంధ విద్య,  చైల్డ్​ లేబర్​ ఎరాడికేషన్​ యాక్ట్​ వంటివి ఉన్నప్పటికీ అమలు పూర్తిస్థాయిలో జరగడం లేదు.

(ఇవాళ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం)