హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ

తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ బీమా కంపెనీ స్విస్ రే ఒకే చెప్పింది. దావోస్ లో స్విస్ రే కంపెనీ ఎండీతో కేటీఆర్ భేటీ అయి పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి వెల్లడించారు. బీమా రంగంలో స్విస్ రే కు 160 ఏళ్ల చరిత్ర ఉందని కేటీఆర్ చెప్పారు.

స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని..ప్రపంచ వ్యాప్తంగా 80 ప్రాంతాల నుంచి ఈ సంస్థ తన కార్యాకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఈ అగష్టులో హైదరాబాద్ లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని..తొలుత 250 మంది సిబ్బందితో కంపెనీ ప్రారంభం కానుందని కేటీఆర్ వివరించారు.  డేటా, డిజిటల్ సామర్థ్యాలు, ఉత్పత్తి నమూనాలు, రిస్క్ మేనేజ్ మెంట్ వంటి అంశాలపై స్విస్ రే దృష్టి సారించనుందని తెలిపారు. 


 
కాగా స్విట్జర్లాండ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్లారు మంత్రి కేటీఆర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరిస్తున్నారు. ఈ  బ్యాంకింగ్,ఫైనాన్స్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్విస్ రే కంపెనీకి ఘనస్వాగతం పలుకుతున్నామన్నారు. 

మరిన్ని వార్తల కోసం

జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

వామ్మో వెయ్యి సిక్సర్లే..!