హస్తకళలకు కేరాఫ్ సూరజ్​కుండ్ మేళా!

హస్తకళలకు కేరాఫ్ సూరజ్​కుండ్ మేళా!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కుంభ​మేళా గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. అయితే, హర్యానాలో మరో మేళా గురించి కూడా జోరుగా వినిపిస్తోంది. అదే సూరజ్​కుండ్​ మేళా. ఈ నెల 7వ తేదీన మొదలైన ఈ మేళా 23వ తేదీవరకు కొనసాగనుంది. ఇంతకీ ఈ మేళా సంగతులేంటి? తెలుసుకుందాం..

హర్యానాలోని ఫరిదాబాద్​లో 38వ సూరజ్​కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఘనంగా జరుగుతోంది. ఈ మేళాలో కళ్లు చెదిరే క్రాఫ్ట్​లు కనిపిస్తాయి. రీజినల్, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్, హ్యాండ్​లూమ్స్​తో పాటు ట్రెడిషనల్ ఫుడ్ వెరైటీలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. దేశీ, విదేశీయులతో కలిపి మిలియన్​కు పైగా ప్రజలతో అక్కడ సందడి నెలకొంది. ఈ మేళాను సూరజ్​కుండ్ మేళా అథారిటీ, హర్యానా టూరిజం డిపార్ట్​మెంట్​కు సంబంధించిన యూనియన్ మినిస్ట్రీలు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ మేళా ప్రతిరోజు ఉదయం10:30కి మొదలై 8:30లకు ముగుస్తుంది. ఇక్కడకు వచ్చే విజిటర్స్ కోసం హస్తకళలు, టెక్స్ట్​టైల్స్ వంటివాటితో వెయ్యికి పైగా స్టాల్స్ ఉన్నాయి.

ఈ మేళా కోసం మొట్టమొదటిసారి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డిఎంఆర్​సి) టికెట్స్​ అమ్మకాన్ని సులభతరం చేసింది. మెట్రో స్టేషన్​లోనే కాదు.. ఆన్​లైన్​, ఆఫ్​సైట్​లో కూడా టికెట్స్ కొనొచ్చు. మామూలు రోజుల్లో టికెట్ ధర రూ.120 ఉంటే వారాంతాల్లో రూ.180 ఉంటుంది. ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలను ఈ మేళాలో లైవ్​గా చూడొచ్చు.