- మూడో సీజన్ లెజెండ్స్ లీగ్ వేదికగా శ్రీనగర్
న్యూఢిల్లీ: దాదాపు నలభై ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాప్ క్రికెటర్లు జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ ఆడనున్నారు. సెప్టెంబర్ 20న మొదలయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) మూడో సీజన్ జోద్పూర్, సూరత్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరగనుంది.
శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్ తదితర 200 మంది క్రికెటర్లు బరిలో నిలిచిన ఈ టోర్నీలో ఆరు జట్లూ 25 మ్యాచ్‌ల్లో పోటీపడనున్నాయి. అక్టోబర్ 16న శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ఫైనల్ షెడ్యూల్ చేశారు.