ఇంటర్నేషనల్ సైబర్ నేరస్థుడు అరెస్ట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అమాయకులను కంబోడియాకు తరలిస్తున్న ఇంటర్నేషనల్‌‌‌‌ సైబర్ క్రిమినల్‌‌‌‌ను సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌‌‌‌బీ) పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన సదాకత్ ఖాన్‌‌‌‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఈనెల 2న అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్‌‌‌‌కు తరలించి విచారించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌‌‌‌కు తరలించారు. వివరాలను టీజీసీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులను కాంబోడియాకు తరలించి అక్కడ సైబర్‌‌‌‌ నేరాలు చేయిస్తున్న ముఠాలపై కేసులు నమోదయ్యాయి. దీనిపై టీజీసీఎస్‌‌‌‌బీ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ అధికారులు దర్యాప్తు చేపట్టి జగిత్యాలకు చెందిన కె. సాయి ప్రసాద్, పుణెకి చెందిన మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ, బీహార్‌‌‌‌కు చెందిన మహ్మద్ షాదాబ్ ఆలంను అరెస్టు చేశారు. 

ఆలం ఇచ్చిన సమాచారంతో పాటు సదాకత్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కదలికలపై నిఘా పెట్టారు. సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్‌‌‌‌సింగ్‌‌‌‌, డీఎస్పీ కేవీఎం ప్రసాద్‌‌‌‌  ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. మాల్దీవుల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో సదాకత్ ఖాన్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు.